నమస్తే శేరిలింగంపల్లి: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రెండుస్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసి పట్టభద్రులందరూ ఎన్నికల్లో పాల్గొనేలా చైతన్య పరిచారని, ఈ కారణంగానే పోలింగ్‌శాతం ఆశించిన స్థాయిలో నమోదైందని తెలిపారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన రాష్ట్రస్థాయి నాయకులు మొదలు కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.






