నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోనే తొలి స్వాతంత్ర్య సమరయోధురాలు దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ పేరిట అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పోస్టల్ శాఖ అధికారుఉల విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం దువ్వూరి సుబ్బమ్మ మనువరాలు రాజ్యలక్ష్మిని కలిసిన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎం.వెంకటేశ్వర్లు ఆమెకు పోస్టల్ కవర్ ఆల్బమ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దువ్వూరి సుబ్బమ్మ మహిళా సాధికారతకు, అంటరానితన నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారన్నారు. సహాయ నిరాకరణ, ఉప్పుసత్యాగ్రమం తదితర స్వాతంత్రోద్యమాలలో పాల్గొని జైలుజీవితాన్ని సైతం అనుభవించారన్నారు. దేశప్రజలు, జమీందార్లు ఖాదీ దుస్తులను ధరించేలా చైతన్య పరిచేందుకు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. దువ్వూరి సుబ్బమ్మ స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ కవర్‌ను రూపొందించి విడుదల చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
