నమస్తే శేరిలింగంపల్లి: కరోన సెకండ్ వేవ్ ఉదృత్తి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి రాత్రి ఖర్ఫ్యూ నిర్వహించనున్నట్లు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటలకే వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేయాలని సూచించారు. 9 గంటల వరకు సదరు సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఇళ్లకు చేరుకోవాలని అన్నారు. అత్యవసర సేవలైన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్ ఇంటర్నెట్ సర్వీసెస్, బ్రాడ్కాస్టింగ్ అండ్ కేబుల్ సర్వీసెస్, ఐటి అండ్ ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్, ఈ కామర్స్ డెలివరీ, పెట్రోల్ పంప్స్, పవర్ జనరేటర్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ సర్వీసెస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్, ప్రొడక్షన్ యూనిట్స్, సర్వీసెస్ కు రాత్రి కర్ప్యూ నుంచి మినహాయింపు ఉంటుందని, అయితే సంబంధిత సిబ్బంది తమ ఐడెంటిటీ కార్డు విధిగా చూపించాలని తెలిపారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఇతర అత్యవసర వైద్య సేవలు, ఎయిర్ పోర్ట్, బస్ డిపోల నుంచి వచ్చేవారు సరైన ఆధారాలు చూపించి నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందవచ్చన్నారు. మే 1 ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, వాటిని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.