నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కు కరోన పాజిటివ్ గా నిర్ధారితమైంది. స్వల్ప కరోనా లక్షణాలతో హమీద్ పటేల్ పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా ఫలితం వచ్చింది. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు సన్ షైన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, డివిజన్ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని హమిద్ పటేల్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, తరచూ చేతులు కడుక్కోవాలని, తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని సూచించారు.






