నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ కమీషనరేట్‌లోని సిఎఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్, బ్యాండ్ పార్టీ వసతి గృహాన్ని సైబరాబద్ కమీషనర్ సజ్జనార్ ఆయన సతీమణి అనుప వీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు. పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సిబ్బంది కోరిక మేరకు నాలుగు కుట్టు మిషన్లతో టైలరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ఇదివరకే 17 మంది సభ్యులతో ఏర్పాటైన బ్యాండ్ పార్టీ బస చేసేందుకు వసతి గృహాన్ని ప్రారంభించి అవసరమైన పరికరాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీ ఎస్ డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీ లక్ష్మి నారాయణ, ఆర్ఐ లు తదితరులు పాల్గొన్నారు.
