శ్రీ ధ‌ర్మ‌పురి క్షేత్రంలో చ‌దువుల త‌ల్లిగా పూజ‌లందుకున్న అమ్మ‌వారు

శ్రీ ధ‌ర్మ‌పురి క్షేత్రంలో చ‌దువుల త‌ల్లి స‌ర‌స్వ‌తీ దేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్న అమ్మ‌వారు

– చిన్నారుల‌కు, వారి త‌ల్లితండ్రుల‌కు భార‌తీయం స‌త్య‌వాణి జ్ఞాన‌బోధ‌
చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీప్తీ శ్రీన‌గ‌ర్ శ్రీ ధ‌ర్మ‌పురి క్షేత్రంలో శ్రీ దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. ఐదవ రోజు బుద‌వారం అమ్మవారు చదువుల తల్లి సరస్వతి దేవిగా భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. ఆల‌య ప్రాంగ‌ణంలో సామూహిక అక్ష‌రాభ్యాసం నిర్వ‌హించ‌గా, తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకురాలు భార‌తీయం సత్యవాణి పిల్లలకు తల్లిదండ్రులకు ప‌లు సూచ‌న‌లు చేశారు. చిన్నారుల త‌మ త‌ల్లితండ్రుల‌తో, గురువులతో, సమాజంతో నడుచుకోవాలో తెలియ‌చేశారు. అదేవిధంగా తల్లిదండ్రులకు త‌మ‌ పిల్లలకు విజ్ఞాన పరమైన అంశాలను బోధిస్తూ ఏ విధంగా తీర్చిదిద్దు కోవాలి, వారిని చ‌దువు ప‌ట్ల ఎలా ఆక‌ర్షితుల‌ను చేయాల‌నే జ్ఞాన సంబంధమైన విషయాలను బోధించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

పండితుల వేద‌మంత్రాల న‌డుమ‌ త‌మ పిల్ల‌ల‌కు అక్ష‌రాభ్యాసం చేయిస్తున్న త‌ల్లితండ్రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here