వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి

  • మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడాల‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అన్నారు. బుధ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని మదీనాగుడా, రామకృష్ణ నగర్ కాలనీల‌లో ఆయ‌న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ సుధాంష్, కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్, అధికారులతో కలిసి పర్యటించారు. అనంత‌రం దీప్తి శ్రీ నగర్ నాలా విస్త‌రణ పనులను మేయ‌ర్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరికి సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు.

హ‌ఫీజ్‌పేట డివిజ‌న్‌లో ప‌ర్య‌టిస్తున్న మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, డీసీ సుధాంష్‌, కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ముంపు ప్రాంతలలో శానిటైజేషన్ చేయిస్తున్నామని, డీఆర్ఎఫ్‌ వాహనాల ద్వారా ముంపు ప్రాంత కాలనీలలో, నాలాలకి ఇరువైపులా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం జరుగుతుందని తెలిపారు. సంప్ లలో క్లోరిన్, బ్లీచింగ్ పౌడర్‌ను చల్లిస్తున్నామని, దీని ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబ‌లకుండా ఉంటాయ‌ని అన్నారు. గత వారం రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల వల్ల దెబ్బతిన్న కుటుంబాలకి చేయూత‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు పంపిణీ చేస్తున్నామ‌ని వివ‌రించారు.

శానిటైజేష‌న్ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న బొంతు రామ్మోహ‌న్‌, ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ చిన్నారెడ్డి, డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్, ఏఎంవోహెచ్ రవి కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, డివిజన్ తెరాస అధ్యక్షులు గౌతమ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు వాలా హరీష్, లక్ష్మారెడ్డి, ప్రసాద్, శాంతయ్య, బాలరాజు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here