– కరోనా ఉదృతిలోను వెనక్కి తగ్గని ఆడపడుచులు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కరోనా విజృంభన కొనసాగుతున్నప్పటికి మహిళలు బతుకమ్మ వేడుకల్లో ఎక్కడా తగ్గలేరు. కొన్ని చోట్ల కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ సంబురాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. నల్లగండ్ల గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాతా నాగేందర్ యాదవ్ స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. చెరువుల వద్ద జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేసినప్పటికి, చెరువులకు వెళ్లే మార్గాల వద్ద వీదిదీపాలు లేక మహిళలు అవస్థలు పడ్డారు. స్థానిక పోలీసులు ముఖ్య కూడళ్ల వద్ద బతుకమ్మ ఉత్సవాలను పర్యవేక్షించారు. భౌతిక దూరం పాటించేలా మహిళలకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. అనూకూల, ప్రతికూల పరిస్థితుల్లోను శేరిలింగంపల్లిలో 2020 సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ముగిసాయి.