నమస్తే శేరిలింగంపల్లి : అల్విన్ కాలనీలో డివిజన్ పరిధిలోని జయశంకర్ నగర్ బస్తీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను ప్రజలు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. వారి పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలు ప్రభుత్వం మధ్య సమస్యలను తీర్చే వారధిగా నిలుస్తామని ఈ సందర్భంగా ప్రజలు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, మనెపల్లి సాంబశివరావు, శేషు, శిరీషా సత్తుర్, రవి, రఫిక్, కృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.