నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పెట్ డివిజన్ హఫీజ్ పేట్ గ్రామంలోని శివాలయంలో ఆలయ కమిటీ సభ్యులు నిమ్మల అనంతరం గౌడ్ ఆధ్వర్యంలో శివకళ్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, గ్రామ పెద్దలు బాలింగ్ యాదగిరి గౌడ్ , రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు ఏకాంత్ గౌడ్, డివిజన్ బిజెపి అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మార్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ , జిల్లా ఎస్సీ మోర్చా సెక్రెటరీ అశోక్ , జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, గ్రామస్తులు వెంకటేష్, దర్శన్, నిమ్మల జగదీష్ గౌడ్, రాజు గౌడ్ కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.