శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవి అమ్మవారి ఆలయ ఐదవ వార్షికోత్సవం, కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు గౌతమ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.






