మంత్రి పీఏ కుమారుడి ఆత్మహత్య

  • మృతుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ, రెవెన్యూ అధికారి దేవేంద్ర కుమారుడు

నమస్తే శేరిలింగంపల్లి: యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ, రెవెన్యూ అధికారి దేవేంద్ర కుమారుడు అక్షయ్ కుమార్(23) కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని ఇంట్లో అక్క బావలతో కలిసి ఉంటున్నాడు. అయితే ఉదయం ఆ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అక్షయ్ కుమారు 10 రోజుల కిందట ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

మృతుడు అక్షయ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here