బిజేవైంఎం ఆద్వ‌ర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నానికి య‌త్నం

దిష్టి బొమ్మ ద‌హ‌నాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

-కార్య‌క్ర‌మాన్నిఅడ్డుకున్న పోలీసులు-ఖండించిన బిజెపి, బీజేవైఎం నేత‌లు
చందాన‌గ‌ర్‌, (న‌మ‌స్తే తెలంగాణ‌): బిజెవైఎం శేరిలింగంప‌ల్లి శాఖ ఆద్వ‌ర్యంలో చేప‌ట్టిన కేసీఆర్‌ దిష్టిబొమ్మ ద‌హ‌నం కార్య‌క్ర‌మం మ‌ధ్య‌లోనే నిలిచిపోయింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్, ఇతర బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారంటూ చందాన‌గ‌ర్ గాంధీ విగ్రహం వ‌ద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి ప్ర‌య‌త్నించారు. కాగా విష‌యం తెలుసుకున్న పోలుసులు రంగంలోకి దిగి దిష్టిబొమ్మ‌‌ను తీసుకెళ్లిపోయారు. కాగా పోలీసుల వైఖ‌రిని బీజేపీ, బీజేవైఎం నాయకులు త్రివంగా ఖండించారు. ప్ర‌జాస్వామ్య‌ రాష్ట్రంలో కనీసం నిరసన తెలియజేయనియకుండా, ఈ తెరాస నాయకత్వం కనుసన్నల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు అని అన్నారు. కాగా ప్ర‌స్థుత స‌మ‌యంలో అనుమ‌తులు లేకుండా ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి వీలులేద‌ని, చ‌ట్టానిక వ్య‌తిరేకంగా వెళితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని చందాన‌గ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ ర‌వింద‌ర్ పేర్కొన్నారు. నియోజకవర్గ కన్వీనర్ కుమ్మరి జితేందర్ అధ్యక్షతన జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, బుచ్చిరెడ్డి, విష్ణుద‌త్‌, హరి ప్రియ, శ్రీనివాస్ రెడ్డి, పార్వతి, వినయ, జయరాములు, రాజు, రెడ్డి ప్రసాద్, లలిత, శ్రీనివాస్, వినిత సింగ్, అజయ్, నందు, రాహుల్, సందీప్, సంతోష్, మోహన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బిజెపి, బిజెవైఎం నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here