రవికుమార్ యాదవ్ నేతృత్వంలో పెద్దసంఖ్యలో స్థానికులు పార్టీలో చేరిక
ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ 124 డివిజన్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యఅతిధిగా తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవి కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ ఆయన మట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ లో అభివృద్ధి పేరుతో సామాన్య జనాలకు నామం పెడ్తున్నారని, డబల్ బెదరూమ్ పేరుతో మోసం చేస్తున్నారని, టీఆర్ఎస్ మాటల గారడిని ఎవ్వరు నమ్మవద్దని, టీఆర్ఎస్ పార్టీ అంటేనే మోసం అని వచ్చే జిహెచ్ఎంసిలో కాంగ్రెస్ దే విజయం అని ఆయన కార్యకర్తలో ఉత్సాహం నింపారు. 124 డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మరెళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరుణాకర్ రెడ్డి, విజయ్ అధ్యక్షణతన సుమారు 200 మంది స్థానికులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో 124 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింహ చారి, ఇస్మాయిల్, నియోజకవర్గం ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు సందీప్, మైనారిటీ నాయకులు సయీద్, డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రవి, ఆంజనేయులు, రామ్మోహన్, సంతోష్, శివ కుమార్,విక్రమ్, గురుమూర్తి, ఎల్లయ్య, సన్యాసి రావు, లింగం, శేఖర్, మధు, రూబెన్, నారాయణ, శ్యామ్, బచెందేర్ సింగ్, మహిళ నాయకురాలు అరుణ, శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రధాన ప్రతినిధి సీత రామరాజు తదితరులు పాల్గొన్నారు.