-42 మందికి కరోనా పరీక్షలు-అందరికి నెగెటీవ్
మియాపూర్ (నమస్తే తెలంగాణ): మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూకాలనీలో హఫీజ్‌పేట్ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర ఆద్వర్యంలో గురువారం కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వినయ్ బాబు నేతృత్వంలో 42 మంది స్థానికులకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించారు. కాగా అందరికి నెగెటివ్ రిజల్ట్ రావడంతో బస్తీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా శుక్రవారం సైతం శిబిరాన్ని కొనసాగిస్తున్నట్టు డాక్టర్ తెలిపారు. కరోనా విషయంలో ఎవరు భయాందోళనకు గురికావద్దని, దైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే కరోనా పాజిటీవ్ వచ్చినా సులువుగా బయటపడవచ్చని అన్నారు. కాగా శుక్రవారం సైతం న్యూకాలనీలో ప్రత్యేక శిబిరం కొనసాగుతుందని, అనుమానం ఉన్న వ్యక్తులు కరోనా పరీక్షలు చేయించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంలు సునితా, సురేఖ, మౌ,నిక, ల్యాబ్ టెక్నిషన్ శిరీష స్థానిక వార్డు మెంబర్లు వరలక్ష్మీ, కిరణ్‌యాదవ్, నాయకులు బాలింగ్ లక్ష్మయ్య గౌడ్, మహేష్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, టిల్లూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.