ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని షంషీగూడ వార్డు కార్యాలయం లో స్థానిక మహిళలకు కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సోమవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలకు తెరాసా ప్రభుత్వం ప్రజలకు పండగ కానుకలు అందజేస్తుందన్నారు. బతుకమ్మ చీరలతో ఆడపడుచులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ యువ నాయకులు రామక్రిష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, నాయకులు నరసింహ చారి, వార్డు సభ్యులు కాశీనాథ్ యాదవ్, నాయకులు మున్నాభాయ్, యాదగిరి, కైసర్ బాయ్, రాములు గౌడ్, నాగేశ్వరరావు, రాజు పటేల్, పోశెట్టి గౌడ్, ప్రదీప్ గౌడ్, మహేష్ గౌడ్, ముస్తఫా, కటికే రవి తదితరులున్నారు.