క‌రోనా కాలంలో గుడ్ల ధ‌న‌ల‌క్ష్మీ ట్ర‌స్ట్ సేవ‌లు అభినంద‌నీయం: ఆరెక‌పూడి గాంధీ

నిరుపే‌ద‌ల‌కు మెడిక‌ల్ కిట్లు పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, గుడ్ల ధ‌న‌ల‌క్ష్మీ త‌దిత‌రులు

– గుడ్ల ధ‌న‌ల‌క్ష్మీ ట్ర‌స్ట్ ఆద్వ‌ర్యంలో చందాన‌గ‌ర్‌లో నిరుపేద‌ల‌కు మెడిక‌ల్ కిట్లు, పండ్లు పంపిణీ

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్‌ డివిజన్ పరిధిలోని వేముకుంట అలిఫా స్కూల్ లో టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కురాలు‌ గుడ్ల ధనలక్ష్మి ట్ర‌స్ట్ ఆధ్వర్యంలో సోమ‌వారం నిరుపేదలకు మెడికల్ కిట్ల పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నిరుపేద‌ల‌కు మెడిక‌ల్ కిట్లు అంద‌జేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ గుడ్ల ధనలక్ష్మి స్వతహాగా ముందుకు వచ్చి సొంత నిధులతో 500 మంది పేద‌ల‌కు మెడికల్ కిట్లను, బత్తాయి పండ్లను అందజేయడం చాలా గొప్ప విషయం అన్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి గాను పేద వారికి సి విటమిన్, పారాసిటమాల్, సిట్ర జన్ వంటి మందులతో పాటు ఆవిరి యంత్రం ను అందచేయడం అభినందించదగ్గ విషయం అన్నారు.

మెడిక‌ల్ కిట్ లోని వ‌స్తువుల‌ను చూపిస్తున్న‌ప్ర‌భుత్వ విప్ అరెక‌పూడి గాంధీ వేదిక‌పై ధ‌న‌ల‌క్ష్మి, ఉరిటి వెంక‌ట్రావు, అకోశ్‌గౌడ్‌, సునితారెడ్డి

పేదల పట్ల ధనలక్ష్మి చేస్తున్న సేవలు అమోఘం అని కొనియాడారు. ధ‌న‌ల‌క్ష్మీ ఎంతోమందికి స్ఫూర్తి దాయకంగా నిలిచారంటూ ఆమెను ప్రభుత్వ విప్ గాంధీ అభినందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఆకలి తో అలమటించకుండా, పస్థులు ఉండకుండా ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ ధ్యేయం అని, కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యత గా ఉండలాని, వైరస్‌వ్యాప్తి చెందకుండా బయటికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం తప్పక పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సునీత ప్ర‌భాక‌ర్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజ‌న్‌ అధ్యక్షలు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయుకులు ఉరిటి వెంకట్రావు, దాసరి గోపి, జేరిపాటి రాజు, ప్రవీణ్, అక్బర్ ఖాన్ ట్రస్ట్ సభ్యులు భవాని చౌదరి, జైకుమార్, రఘు, వరలక్ష్మి, రామస్వామి సత్యవతి, ప్రభావతి వంశీ సత్య శివ తదితరులు పాల్గొన్నారు.

మెడిక‌ల్ కిట్ల కోసం కొసం భౌతిక దూరం పాటిస్తూ వేచి ఉన్న నిరుపేద‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here