ష‌బ్ ఎ బ‌రాత్ కు ఏర్పాటు చేయాల‌ని జోన‌ల్ క‌మీష‌న‌ర్‌కు విన‌తి

జోన‌ల్ క‌మీష‌న‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పిస్తున్న హ‌ఫీజ్‌పేట్ టిఆర్ఎస్ నాయ‌కులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ముస్లీం సోద‌రులు ప‌విత్రంగా నిర్వ‌హించుకునే పండుగ ష‌బ్ ఎ బ‌రాత్ కు ఏర్పాట్లు చేయాల‌ని కోరుతూ హఫీజ్‌పేట్ డివిజ‌న్ టిఆర్ఎస్ నాయ‌కులు జోన‌ల్ క‌మీష‌న‌ర్ కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఇస్లామిక్ క్యాలెండ‌ర్ 8వ నెల అయిన షాబాన్ నెల 15వ రోజు రాత్రి పూర్వికుల‌ను క్ష‌మించ‌మ‌ని అల్లాను వేడుకునేందుకు ముస్లీంలు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తార‌ని, ఈ రోజుకు ఇస్లాంలో ప్రాధాన్య‌త క‌లిగి ఉన్న‌ట్లు తెలిపారు. ట్వెల్వర్ షియా ముస్లింలు ఈ తేదీన ముహమ్మద్ అల్-మహదీ పుట్టినరోజును జరుపుకుంటారని తెలిపారు. ష‌బ్ ఎ బ‌రాత్ ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ తహెర్ హుస్సేన్, సయ్యద్ సత్తార్ హుస్సేన్, సాబేర్, జామీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here