- ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ కృష్ణా మాల్
నమస్తే శేరిలింగంపల్లి : బావితరాలకు సావిత్రిబాయి పూలే ఆదర్శప్రాయురాలని ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ కృష్ణ మాల్ (కేరళ) అన్నారు. సావిత్రిబాయి పూలే 193 జయంతి కార్యక్రమాన్ని స్టాలిన్ నగర్ లో ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ కృష్ణ మాల్ మాట్లాడుతూ.. ఆనాటి సామాజిక అసమానతలలో మహిళా చదువుకోవాలంటేనే బ్రాహ్మణిజం ఆధిపత్యంలో చదువుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

తన భర్త జ్యోతిరావు పూలే మహిళలు చదువుకోవాలని మొదటిసారిగా తన భార్య సావిత్రిబాయికి చదువు నేర్పించి సమాజంలో మహిళలు కూడా అభివృద్ధి కావాలని బ్రాహ్మణిజాన్ని, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని గురించి మొదటి మహిళగా ఆదర్శప్రాయంగా విద్యావంతురాలుగా సావిత్రిబాయి పూలేను సమాజంలో ముందు ఉంచారని అన్నారు.

నేటి సమాజానికి సావిత్రిబాయి పూలే ఎంతో ఆదర్శప్రాయురాలని ఆమె అడుగుజాడల్లో నడిచిన రోజే మహిళలు మరింత అభివృద్ధి అవతారని సమాజం మరింత పురోగతం చెందుతుందని ఆ దిశగా అందరం ముందుకు సాగాలని తెలిపారు.
ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరత్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కుంభం సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ భాగ్యమ్మ, ఏ పుష్ప, పల్లె మురళి మియాపూర్ డివిజన్ నాయకులు, గూడ లావణ్య, ఎం. రాణి డి.నరసింహ, ఎండీ సుల్తానా బేగం, ఇషాక్, గౌసియా బేగం, ఎండీ రజియా బేగం, మెరుగు నర్సింహా, విజయ్ లక్ష్మి, రిన్న, చాన్ బి, పుష్ప, శివమని పాల్గొన్నారు.





