మియాపూర్ బీజేపీ రేసులో సమ్మెట ప్రసాద్

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ల సమక్షంలో పార్టీలో చేరుతున్న సమ్మెట ప్రసాద్

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, చిరంజీవి అభిమాన సంఘం ప్రముఖులు, కాపు సామజిక వర్గ నేత సమ్మెట ప్రసాద్ బిజెపి పార్టీ లో చేరారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ తో పాటు బిజెపి లో చేరిన సమ్మెట ప్రసాద్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ల చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకుల చేరికతో బిజెపి బలోపేతమయ్యిందని, ఎన్నికల్లో శేరిలింగంపల్లి లోని అన్ని స్థానాలలో బిజెపి విజయ కేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేసారు. మియాపూర్ డివిజన్ నుండి బిజెపి తరపున పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి విన్నవించానని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. మియాపూర్ డివిజన్ లో పార్టీ గెలుపు కోసం తన శక్తి వంచన లేకుండా పాటుపడతానని అయన తెలిపారు.

 

సమ్మెట ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here