మాదాపూర్, (నమస్తే శేరిలింగంపల్లి): తెలుగుదేశం పార్టీ మాదాపూర్ డివిజన్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ ఆ పార్టీ విద్యార్ధి సమాఖ్య రాష్త్ర ఉపాఢ్యక్షుడు తన్నీరు ప్రసాద్ టిడిపి అధిష్టానానికి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు బుధవారం స్థానిక నాయకులతో కలిసి టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ సుభాష్ యాదవ్ లకు బయోడేటా అందజేశారు. గత 17 సంవత్సరాలుగా టిడిపి పార్టీలో ఉంటూ పార్టీ ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండ పాటిస్తూ పార్టీ అభివృదికి కృషి చేసినట్లు తెలిపారు. 2003 లో టీఎన్ఎస్ఎఫ్ విభాగంలో పలు పదవుల్లో కొనసాగుతూ ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తన సేవలను పార్టీకి అందిస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం లో కూకట్ పల్లి జేఏసీ విద్యార్ధి విభాగం కన్వీనర్ గా పని చేసి ఉద్యమంలో తన బాధ్యతను నిర్వర్తించినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాదాపూర్ డివిజన్ తరపున టిడిపి అభ్యర్థి గా తనకు అవకాశం కల్పించాలని, పార్టీ ని భారీ మెజారిటీ తో గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.