మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): రవికుమార్ యాదవ్ టీమ్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్‌కు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేశారు. మంగళవారం మియాపూర్ పోగుల ఆగయ్యనగర్‌కు చెందిన ఓ నిరుపేద కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న ఆర్‌కెవై టీం సభ్యులు వారికి అవసరమైన నిత్యవసర సరుకులను మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి రాఘవేందర్‌రావు చేతుల మీదుగా అందజేశారు. సమాజంలో నిరుపేదలకు అండగా ఉండేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నామని ఆర్‌కెవై టీం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం అధ్యక్షులు గంగారం మల్లేష్, ప్రధాన కార్యదర్శి గుండెగణేష్ ముదిరాజ్, సభ్యులు జాజిరావు, శ్రీనివాస్, రేపాన్ వెంకటేష్, రాము, సారా రవీందర్, జాజిరావు శ్రీధర్, సోను కుమార్ యాదవ్, వినోద్ యాదవ్, రవీందర్ రెడ్డి, ప్రతాప్ గోపి, నారాయణ, రమేష్, రాజేందర్ వర్మ, సురేష్, అతరీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
