నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని విజయదుర్గ భవాని దేవాలయ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 17, 18 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం గణపతి హోమం, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణం, లలితా సహస్ర నామ పారాయణం, ప్రసాదవితరణ, గురువారం పార్వతీ లక్ష్మీ గణపతి హోమం, పరమేశ్వరుల కళ్యాణం, పల్లకి సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో పూజా కైంకర్యాలలో పాల్గొనదలచిన భక్తులు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.






