నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని సోమేశ్వర స్వామి దేవస్థాన ఆలయకమిటీ సభ్యులు మంగళవారం కమిటీ చైర్మెన్ చెన్నంరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌గాంధీతో పాటు కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు నరేందర్ గౌడ్, వసంత కుమార్ యాదవ్, ముత్యాల రవీందర్, కాలాకంటి రాధా తదితరులు పాల్గొన్నారు.
