నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రంజిత్ అన్న యూత్ అసోసియేషన్ నాయకులు చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డిని కలిశారు. యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ కటకం నేత ఆధ్వర్యంలో ఎంపిని కలిసిన నాయకులు ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేలా కృషి చేయాలని రంజిత్‌రెడ్డి సూచించారు. ఎంపిని కలిసిన వారిలో అసోసియేషన్ సభ్యులు జహీరుద్దీన్, అనిల్, శ్రీను, రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.






