నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యలపై చట్టసభలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను పెద్దల సభకు పంపించాల్సిన అవసరం ఉందని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు మారబోయిన రవికుమార్ యాదవ్ అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి- హైదరాబాద్-మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని శనివారం మియాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను కలిసి బిజెపికి ఓటువేయమని కోరారు. దీంతో పాటు వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీలోగల రిలయన్స్ ఆర్కేడ్లో పట్టభద్రుల ఓటర్లను కలిసి బిజెపి బలపరచిన అభ్యర్థి రామచంద్రారావుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నిరుద్యోగులను నట్టేట ముంచిన కెసిఆర్ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. కేవలం వాగ్దానాలకు పరిమితమై కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కర్చర్ల ఎల్లేష్, రాధా కృష్ణ యాదవ్ , రఘునాథ్ యాదవ్ , గణేష్ ముదిరాజ్, వినోద్ యాదవ్, శ్రీనివాస్, రాము, వివేకానంద నగర్ డివిజన్ బిజెపి ఇంచార్జ్ ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్, సీతారామరాజు, భాను యాదవ్, గణేష్ గౌడ్, అశోక్, సంతోష్, వెంకటేష్, యాదగిరి, జితేందర్, వినోద్, శ్రీనివాస్, మధుసూదన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






