నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రంగారెడ్డి(అర్బన్) జిల్లా మజ్దూర్ మోర్చ కన్వీనర్‌గా శేరిలింగంపల్లికి చెందిన ఎస్.ఎస్.వరప్రసాద్ ఆళ్ల నియమితులయ్యారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి వరప్రసాద్ కు నియామక పత్రాన్నిఅందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై నీతి, నిజాయితీ, నిబద్ధతగల కార్యకర్తగా గత 15 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పని చేస్తున్నానని తెలిపారు. తన సేవలను గుర్తించిన పార్టీ నాయకులు రంగారెడ్డి అర్బన్ జిల్లా మజ్దూర్ మోర్చా కన్వీనర్ గా నియమించినందుకు రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, ఇంచార్జ్ అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, కన్వీనర్ బుచ్చి రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
