శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను నిర్వహించి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, తనకు ఈ అవకాశాన్ని కల్పించిన బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.
