హైదర్ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని రాంనరేష్ నగర్ వాసులు గురువారం ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ కలిశారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. స్పందించిన గాంధీ కాలనీ లో నెలకొన్నా డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించేలా చూస్తామని, కాలనీ లో ఏ చిన్న సమస్య తలెత్తినా తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తానని బరోసా ఇచ్చారు . ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కోనేరు ప్రసాద్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.