
హఫీజ్ పెట్,మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): బ్యాచిలర్ డిగ్రీ పాసైన ప్రతీ పట్టభద్రుడు పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటర్ నమోదు చేయించుకోవాలని మాదాపూర్, హఫీజ్ పేట డివిజన్ల కార్పొరేటర్లు వి. పూజిత, జగదీశ్వర్ గౌడ్ లు పేర్కొన్నారు. గురువారం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో స్థానిక కమిటీ సభ్యులు, మహిళలలతో కలిసి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు కాలనీ సంక్షేమ సభ్యులు కృషి చేయాలన్నారు. పాత జాబితాలో ఓటరుగా ఉన్న వారు సైతం నూతనంగా ఓటు హక్కు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మనోహర్ గౌడ్, ప్రభాకర్, చంద్రశేఖర్, మోసిన, రాజేశ్వర్ గౌడ్,రాజేందర్, సాయి బాబా, రాములు, పోగు శ్రీను, రాజు యాదవ్, వెంకట్ నారాయణ, సుబ్బా రెడ్డి, రాముయాదవ్, నారాయణ రెడ్డి, బాల సుబయ్య, కిరణ్, రవి, శ్రీనివాస్, మస్తాన్, ప్రసాద్, మురళి, రంజాన్, మహిళలు అరుణ, స్వరలత, శోభ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.