హైదర్ నగర్(నమస్తే శేరిలింగంపల్లి): దేవాలయానికి వచ్చే భక్తుల మనోభావాలను గౌరవించే బాధ్యత పాలక మండలి సభ్యులకు ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీ లోగల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఆరేకపూడి గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నూతన ఓలక మండలి సభ్యులు ఎమ్మెల్యే సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ నిష్పక్షపాతంగా దైవ సన్నిధిలో సేవలు అందించాలని సూచించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని, దైవ చింతనకు ఎటువంటి లోటు లేకుండా కార్యక్రమాలు చేయాలన్నారు. భక్తులకు దర్శనం, పూజ వంటి కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, ఆలయంలోకి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కలిపించాలన్నారు. నిత్యం దైవ సన్నిధిలో ఉంటూ దేవుడి సేవలో నిమగ్నమై ఉండాలని, ఆ దేవుడి కటాక్షం పొందేలా ప్రతి ఒక్కరు పాటుపడాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కేఆర్ కె రాజు , శ్రీనివాస్, శ్రీహరి, కిరణ్, అప్పిరెడ్డి, కుమారస్వామి, లక్ష్మీ బొప్పన లతో పాటు తెరాస నాయకులు కోనేరు ప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు.