- గంగారం గ్రామంలో నివాళి అర్పించిన ఎం.బి.సి చైర్మన్ జేరిపేటి జైపాల్ , శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతిని గంగారాం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఆయన విగ్రహానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఎం.బి.సి చైర్మన్ జేరిపేటి జైపాల్ తో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐటీలో హైదరాబాద్ నిలబడడానికి ముఖ్యకారకులు రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన సంస్కరణలే అని గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షడిగా ఆయన చేసిన సేవలు ఈరోజు యువతకు ఎంతో మార్గదర్శనంగా నిలుస్తూ రాజకీయాలో రాణించేలా చేస్తుందని అన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికీ చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.