నమస్తే శేరిలింగంపల్లి: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను రంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు రాచమళ్ళ నాగేశ్వర్‌గౌడ్ సన్మానించారు. తాజాగా రాచమళ్ళ నాగేశ్వర్‌గౌడ్ రంగారెడ్డి జిల్లా ఓబిసి మోర్చ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా షిమ్లాలోని గవర్నర్ నివాసంలో దత్తాత్రేయను కలిసిన నాగేశ్వర్‌గౌడ్ ఆయనకు పుష్పగుచ్ఛం సమర్పించి శాలువాతో సత్కరించారు.
అనంతరం గవర్నర్ దత్తాత్రేయ నాగేశ్వర్‌గౌడ్ కు హిమాచల్‌ప్రదేశ్ సాంప్రదాయ టోపీతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గవర్నర్‌తో సమావేశంలో గతంలో పార్టీలో వారితో కలసి చేపట్టిన కార్యక్రమాలను, జ్ఞాపకాలను నెమరువేసుకున్నామని తెలిపారు. దత్తాత్రేయతో తనకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఓబిసి మోర్చ అధ్యక్షుడిగా తాను అందుకున్న పదవి తనపై మరిన్ని బాధ్యతలు పెంచిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.