చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారం హనుమాన్ దేవాలయ సమీపంలో జరిపిన తవ్వకాల్లో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. రెండు వారాల క్రితం పలు అభివృద్ది పనుల నిమిత్తం గంగారం చెరువు అలుగు సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా విగ్రహాలు బయటపడ్డాయి. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు విగ్రహాలను చూసేందుకు తరలివెళ్లారు. విగ్రహం రూపం స్పష్టంగా లేకపోవడంతో పలువురు హనుమంతుడి విగ్రహం అయ్యుంటుందని అభిప్రాయ పడుతుండగా, పలువురు విష్ణుమూర్తిదని, మరికొందరు ద్వార పాలకుడి విగ్రహం అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.