నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరాంకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా ఆయనను టీఆర్పీఎస్, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. వెంకట్ రెడ్డి, వైద్య బృందం మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పూల బోకే అందించి శాలువాతో సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో బహుకరించి మరొక్కసారి శుభాకాంక్షలు తెలిపారు.