రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న కృషి ఎనలేనిది

  • శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్
  • మియాపూర్ అల్విన్ కాలనీ చౌరస్తాలో పాపన్న గౌడ్ విగ్రహానికి ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ అల్విన్ కాలనీ చౌరస్తాలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, నియోజకవర్గ నాయకులతో కలిసి పాపన్న విగ్రహానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మియాపూర్ అల్విన్ కాలనీ చౌరస్తాలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా వారి కృషిని, పోషించిన చారిత్రక పాత్రను స్మరించుకున్నారు. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమన్నారు. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.

పాపన్నగౌడ్ సేవలను కొనియాడుతూ నినాదాలు చేస్తూ..

తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లభించిందని, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ, కేంద్రాల్లో/రాష్ట్రంలో అమలు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ గౌడ్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, మూల వెంకటేష్ గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రచమల్ల వెంకటేష్ గౌడ్, యాదగిరి గౌడ్, కరుణాకర్ గౌడ్, పుట్టా వినయ్ కుమార్ గౌడ్, ఏకాంత్ గౌడ్, నాగులు గౌడ్, సురేష్ గౌడ్, కూన సత్యం గౌడ్, రక్తపు శ్రవణ్ గౌడ్, మూల అనిల్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, నవీన్ రెడ్డి, యల్లమంచి ఉదయ్ కుమర్, రామచందర్ గౌడ్, రవి కుమార్ గౌడ్, రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జనార్దన్ గౌడ్, మహిళలు కల్పన గౌడ్, శిరీష సత్తుర్, మహాలక్ష్మి, శ్రావణి, స్వప్న గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here