ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను ప్ర‌జాప్ర‌తినిధులు గాలికొదిలేస్తున్నారు: గ‌జ్జ‌ల యోగానంద్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ప్ర‌జ‌ల‌కు హామీలు గుప్పించి తీరా గెలిచిన అనంత‌రం ఇచ్చిన వాగ్డానాల‌ను ప్ర‌జాప్ర‌తినిధులు గాలికొదిలేస్తున్నార‌ని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ బిజెపి ఇంచార్జ్ గజ్జ‌ల యోగానంద్ అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని సాయిన‌గ‌ర్‌లో స్థానికుల విజ్ఞ‌ప్తి మేరకు హిందూ స్మ‌శాన‌వాటిక‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా స్మ‌శాన వాటిక‌లో చేప‌ట్ట‌వ‌ల‌సిన అభివృద్ది ప‌నులుపై చ‌ర్చించారు. అనంత‌రం యోగానంద్ మాట్లాడుతూ స్మ‌శానవాటికలో కనీస వసతుల కల్పన కోసం పోరాడ‌తామ‌ని, ప్ర‌జ‌ల‌కు అండగా ఉండి వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, కార్పొరేట‌ర్లు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బస్తీలలో సమస్యలు పరిష్కారం అయ్యే వ‌ర‌కు అధికార పార్టీ నాయకులను, ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్, బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, బీజేపీ నాయకులు శివ, రాజు, సంజయ్, మహేష్, దత్తాత్రేయ, అశోక్, రవి ముదిరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

బ‌స్తీ వాసుల‌తో క‌లిసి స్మ‌శాన‌వాటిక‌ను సంద‌ర్శించిన గ‌జ్జ‌ల యోగానంద్‌

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here