నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడి కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. మంగళవారం మియాపూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, రోజాదేవి రంగరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, జలమండలి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెకపుడి గాంధీ మాట్లాడుతూ గాంధీ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గం లో 18 రిజర్వాయరాలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటింటికీ స్వచ్చమైన మంచినీరు అందిస్తున్నామని, ఇప్పటి వరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన మంచి నీటి పనులను సమీక్షించడం జరిగిందని తెలిపారు. నీటి సరఫరాలో సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పైప్‌లైన్ లేని ప్రాంతాలు, కలుషిత నీటి సరఫరా, మరమ్మత్తులు చేయాల్సిన ప్రాంతాలను వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి స్వచ్చమైన మంచి నీరు అందించాలనే ఉద్దేశ్యంతో డివిజన్లలో కొత్త ప్రాంతలను ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ద్వారా సమాచారం సేకరించి ప్రతిపాదిత పనుల కొరకు అంచనాలు తయారు చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకం ద్వార అర్హులందరికీ వర్తింపజేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ, నాయకులు రఘునాథ్‌రెడ్డి, మాధవరం రంగారావు వాటర్ వర్క్స్ జియం. రాజశేఖర్, డిజియంలు శ్రీమన్నారాయణ, వెంకటేశ్వర్లు, నాగప్రియ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ గాంధీ





