నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బిజెపి నాయకుడు గుండె గణేష్ ముదిరాజ్ ఆద్వర్యంలో మక్తమహబూబ్‌పేట్, పీఏ నగర్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎం.రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని బిజెపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, అందుకు ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంలో చేపడుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కారణమని అన్నారు. మిగిలిన పార్టీలతో పోలిస్తే బిజెపిలో కార్యకర్తల కృషిని మిక్కిలి పరిగణలోకి తీసుకోబడుతుందని, పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. అనంతరం పీఏ నగర్‌కు చెందిన స్థానిక నాయకుడు లడ్డు బిజెపిలో చేరగా రవికుమార్ యాదవ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ఇన్చార్జీ రాఘవేందర్‌రావు, నాయకులు ఆకుల లక్ష్మన్, రేపన్ వెంకటేష్, మల్లేష్, శీను, రవిందర్, రాము, సోను, తివారి, వినోద్, శివరాజ్, బాబు తదితరులు పాల్గొన్నారు.