ర‌వీంద్ర‌భార‌తిలో కామ్రేడ్ గంగిరెడ్డి షార్ట్‌ఫిలిం స్ర్కీనింగ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ట్రెండి టీవి, బృహస్పతి టెక్నాలజీస్ సంస్థల ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం రవీంద్రభారతిలో షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ల‌ఘు చిత్రాల స్పెషల్ స్క్రీనింగ్ నిర్వ‌హించారు. దీనిలో భాగంగా కామ్రేడ్ గంగిరెడ్డి ల‌ఘుచిత్రాన్ని తిలకింఛిన న్యాయ నిర్ణేతలు సినీ నటుడు,నిర్మాత లోహిత్ కుమార్, కధా రచయిత, దర్శకులు నాగు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సంద‌ర్భంగా న్యాయ నిర్ణేత‌లు సినిమా నిర్మాణం, దర్శకుడు తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు, క‌థ‌, క‌థ‌నం త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. యూనిట్ స‌భ్య‌ల‌కు నారి లక్ష్యసాధన ఫౌండేషన్ ఛైర్మెన్ మాధవి, ఎండీ జీ.ఎన్ రావులు కలిసి జ్ఞాపిక‌ల‌తో పాటు ప్రశంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్ జీ. సాయి క్రిష్ణారెడ్డి, న‌టుడు, డైర‌క్ట‌ర్ రామ‌కృష్ణ‌గౌడ్‌, నిర్మాత సంతోషిరాజశేఖర్ రెడ్డి , నటులు టీ.రాజశేఖ‌ర్ రెడ్డి, ఆర్కె, కాలా, పృథ్వి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

షార్ట్‌ఫిల్మ్ యూనిట్ స‌భ్యుల‌కు జ్ఞాపిక‌ల‌ను అంద‌జేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here