నమస్తే శేరిలింగంపల్లి: మరమ్మత్తులు, విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మల తొలగింపు తదితర సాంకేతిక కారణాల చేత శనివారం మియాపూర్, నల్లగండ్ల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడున్నట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. మియాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే హెచ్ఎంటి ఫీడర్ పరిధిలోని కృషినగర్, ఎమ్.ఎ.నగర్, స్టాలిన్‌నగర్, రాఘవేంద్ర పాంచజన్య అపార్ట్‌మెంట్, ఏలియన్ అపార్ట్‌మెంట్, ప్రశాంత్‌నగర్, ప్రగతిఎన్క్లేవ్ పరిధిలోని మణిసాయి అపార్ట్‌మెంట్, మిర్రా హాస్పిటల్, సాయిరామ్‌నగర్, ఎ.ఎస్.రాజునగర్, డి.కె.నగర్ ప్రాంతాలు, స్వర్ణపురి కాలనీ ఫీడర్ పరిధిలోని స్వర్ణపురి కాలనీ, రెడ్డి ల్యాబ్స్, జెపి నగర్, క్రిష్ణసాయి ఎన్‌క్లేవ్, బికె ఎన్‌క్లేవ్ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 గం.ల నుండి 11 గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. దీంతోపాటు నల్లగండ్ల నవోదయ ఫీడర్ పరిధిలోని జవహార్‌నవోదయ స్కూల్, సాయిరామ్‌నగర్, కంచ గచ్చిబౌలి, రామ్‌కీ కాస్మోస్, యుసిఒ బ్యాంక్ ఏరియా ప్రాంతాల్లో ఉదయం 10గం.ల నుండి మద్యాహ్నం 12 గం.ల వరకు, ఎపిస్టోమ్ గ్లోబల్ స్కూల్ ఏరియా, రాక్ పిఎస్ఆర్‌కె ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గం.ల నుండి సా.5 గం.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు.