నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం వెళ్లే ప్రధాన రహదారిపై పగిలిన మంచినీటి పైప్‌లైన్ పునరుద్ధరణ పనులను జలమండలి డీజీఎం నాగప్రియ బృందంతో కలసి శుక్రవారం రాత్రి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్‌లైన్ పగిలిపోవడంతో స్థానికులకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తవద్దనే ఉద్దేశంతో యుద్ధప్రాతిపధకన పునరుద్ధరన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తున్న జలమండలి సిబ్బందికి ఆయన ప్రత్యకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్పూర్తితో డివిజన్‌లో ఎలాంటి సమస్య ఎదురైనా త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్లు సాయిచరిత, రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






