హఫీజ్‌పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని గంగారం గ్రామంలో స్థానిక కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ శనివారం పర్యటించారు. స్థానిక కమ్యూనిటీ హాల్‌లో ప్రభుత్వం తరపున వచ్చిన బతుకమ్మ చీరలను గ్రామ మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం స్థానికంగ జీహెచ్ఎంసీ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి సమపాళ్లలో కోనసాగుతుందని అన్నారు. కరోనా విజృంభన కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి ఆగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు దొంతి శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, ప్రవీణ్ కుమార్, జ్ఞనేశ్వర్, సుధాకర్, రాజు తులసి దాస్, చిన్నతదితరులు పాల్గొన్నారు.