హఫీజ్‌పేట్(నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలోని అలేఖ్య హోమ్స్ పట్టభద్రులతో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను పట్టభద్రులకు ఆయన వివరించారు. 2017 నాటికి డిగ్రీ/డిప్లమా పూర్తి చేసుకున్న వారంతా విధిగా ఓటర్లుగా నమోదు అవ్వాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఫామ్ 18 పత్రాలను పూరించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాగా అలేఖ్య హోమ్స్ వాసులు సానుకూలంగా స్పందించారు.