– ముప్పవరం లో గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వర్లులను పరామర్శించిన త్రివేణి సిబ్బంది
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): త్రివేణి-కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్లు గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వర్లు చేపట్టిన భద్రాచలం నుండి తిరుమల పాదయాత్ర ఒంగోలు సమీపానికి చేరుకుంది. త్రివేణి విద్యాసంస్థల ప్రతినిధులు ఒంగోలుకు 30 కి.మి దూరంలో ఉన్న ముప్పవరం సాయిబాబా దేవాలయంలో శుక్రవారం యాత్రికులు గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వర్లులను కలిశారు. వారి యాత్ర అనుభవాన్ని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని అభినందించారు. పాద యాత్రికులను పరామర్శించిన వారిలో త్రివేణి సిఆర్వో సాయి నరసింహారావు, అకాడమిక్ ఇంచార్జ్ కిషోర్, ట్రాన్స్ పోర్ట్ ఇన్చార్జి రామకృష్ణ, నాగరాజు తదితరులున్నారు.