శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కార్యాలయం ప్రారంభం

శేరిలింగంపల్లి ‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ ప్రధాన రహదారిలో బీజేపీ డివిజ‌న్‌ కార్యాలయాన్ని శుక్ర‌వారం ప్రారంభించారు. డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజు శెట్టి అధ్యక్షతన జరిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి గజ్జల యోగానంద్ హాజ‌రై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయ‌న‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కార్య‌ల‌యాన్ని ప్రారంభిస్తున్న ఆ పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి గజ్జల యోగానంద్

అనంత‌రం గజ్జల యోగానంద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇదొక శుభారంభం అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలందరూ ఎంతో సేవా భావంతో పని చేస్తున్నారని, ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడమే కాకుండా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను పరిష్కరించే దాకా ఒక పోరాట స్పూర్తితో ముందుకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు బాసటగా నిలుస్తూ తెరాస ప్రభుత్వ వైఫల్యాలు, అరాచక పాలనను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు ఆరోగ్యకరమైన పోటీతో అభివృద్ధిలో దూసుకుపోవాలని సూచించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్ల‌ను గెలుస్తామన్న ధీమా ప్రజలు ఇవ్వడం తెరాస ప్రభుత్వానికి కంటగింపుగా ఉందని ఎద్దేవా చేశారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బీజేపీ నాయ‌కులు క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్ త‌దిత‌రులు

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ బుచ్చి రెడ్డి, రాష్ట్ర నాయకులు భాస్కర రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు వెంకట్ మారం, జయరాములు, సురేశ్ మట్ట, ఆల్లకొండ యాదగిరి, హరి ప్రియ, వినిత సింగ్, చంద్ర శేఖర శాస్త్రి, శ్రవణ్ పాండే, బాలరాజు, రజనీ కోమిరె, పట్లోళ్ళ నరసింహ, క్రాంతి మాదిగ, కె. అరుణ కుమారి, ఎం.అశోక్ నాయక్, సత్య కుర్మ, మహేశ్ రాపన్, యార బబ్లూ, సబినా, శ్రీలత, జక్కుల శ్రీకాంత్, విఠల్ రాథోడ్, శంకర్, శ్రీను, లక్ష్మి, రాజు, చక్రహరి రాజు, మస్తాన్, విజయ్ లింగంపల్లి, సాయి వెంకట్, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here