- నగరంలో 9 నెలల తర్వాత మళ్లీ మొదలైన సినిమాల ప్రదర్శన
- ప్రభుత్వం అనుమతించిన 50 శాతం ఆక్యుపెన్సీ సైతం నిండని వైనం
నమస్తే శేరిలింగంపల్లి: చాలామంది సినిమా ప్రియులు థియేటర్‌లలో చివరి సినిమా ఎప్పుడు చూశారో, ఏ సినిమా చూశారో కూడా మరిచిపోయే ఉంటారు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడి దాదాపు 9 నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే కొన్ని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరచుకుంటున్నాయి. బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకు తహతహలాడుతున్న ప్రేక్షకులకు ఇది ఆనందం కలిగించే విషయమే. ఐతే భౌతిక దూరం పాటించేందుకు సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా ప్రభుత్వం నిబంధన విధించడంతో సీటు విడిచి సీటులో కూర్చునేలా సినిమా హాళ్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్నేహితులైనా, ప్రేమికులైనా మధ్యలో సీటు వదలాల్సిందే. ఇక మూత్రశాలల్లో కూడా సామాజిక దూరం పాటించేందుకు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు నిర్వాహకులు. పార్కింగ్‌లోకి ఎంటరవ్వడం మొదలు ఆడిటోరియం డోరు వరకు అడుగడుగునా హ్యాండ్ శానిటైజర్లు, కెఫ్‌టేరియాలో భోజన ప్రియులు క్యూలో భౌతిక దూరం పాటించేందుకు మీటర్ దూరం చొప్పున మార్కింగ్ వేశారు.

కరోన నేపథ్యంలో థియేటర్లు, మల్లిప్లెక్స్‌ల యజమానులు జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ప్రేక్షకుల నుంచి మాత్రం స్పందన అంతత మాత్రమే కనిపిస్తుంది. ప్రభుత్వ నిబంధనల కారణంగా మొదలే 50 శాతం ఆక్యూపెన్సీతో నడుస్తున్న థియేటర్లలో మిగిలిన 50 శాతం కూడా ప్రేక్షకులు నిండకపోవడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఐతే ప్రస్థుతం కొత్త సినిమాలు ఏమి లేకపోవడం, ఉన్న పాత సినిమాలను సైతం కొన్ని షోలకు మాత్రమే పరిమిత చేయడం వల్ల కూడా ఆశించిన మేర ప్రేక్షక్షులు రావడం లేదని అనుకోవచ్చు. సాదారణంగా మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకుడి సినిమా టిక్కెట్ల కొనుగోలుపై కంటే కూడా తినుబండారలపైనే మిక్కిలి ఆదాయం వస్తుంది. అలాంటిది అతికష్టం మీద సినిమా చూసేందుకు వస్తున్న ప్రేక్షక్షులు స్నాక్స్ కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపడం లేరు. ఇలా అనేక అంశాలు సినిమా హాళ్ల నిర్వాహకులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని థియేటర్లకు ఎప్పుడు పూర్వవైభవ స్థితి వస్తుందో..? కాలమే నిర్ణయించాలి.
