ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి

  • జర్నలిస్ట్ సంతోష్ నాయక్ కు మద్దతుగా గళమెత్తిన శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్
  • చందానగర్ జాతీయరహదారిపై గూడెం మహిపాల్ రెడ్డి శవయాత్ర
  • గాంధీవిగ్రహం వద్ద రాస్తారోకో – ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జర్నలిస్ట్ సంతోష్ నాయక్ పై పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులను ఖండిస్తూ శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ గళమెత్తింది. గురువారం చందానగర్ అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ సాగర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, రోడ్డుపై ధర్నా చేపట్టారు.

చందాన‌గ‌ర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న వ్యక్తం చేస్తున్న జ‌ర్న‌లిస్టులు

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు పైళ్ల విట్టల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ లు మాట్లాడుతూ ప్రజలకు తన కలం ద్వారా వాస్తవాలను వివరిస్తున్న జర్నలిస్టు సంతోష్ నాయక్ ను ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం, బెదిరించడం హేయమన్నారు. జర్నలిస్టు సంతోష్ కు అండగా టీయూడబ్ల్యూజే నిలుస్తుందని, సంతోష్ కు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ సంతోష్ కు అండగా ఉంటుందన్నారు. మహిపాల్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది పరిశ్రమల యాజమాన్యాలను అడిగితే చెపుతారన్నారు.

టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు గంట్ల రాజి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అక్రమాలపై కథనాలు రాస్తే చంపుతానని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీద కేసులు పెట్టడంతోనే సరిపోదని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులకు పాల్పడడం ఇది కొత్త కాదని, గతంలో సైతం జర్నలిస్టుల మీద మహిపాల్ రెడ్డి ఇదే తీరుగా వ్యవహరించాడ‌ని తెలిపారు. వెంటనే మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్ట్ సంతోష్ నాయక్ కు మద్దతుగా చందానగర్ లో ర్యాలీ నిర్వ‌హిస్తున్న జర్న‌లిస్టులు

ప్రెస్ క్లబ్ మాజీ ప్రధానకార్యదర్శి పుట్ట వినయ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డి తన అనుచరులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు ప్రతిపక్షం, జర్నలిస్టుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాధిత జర్నలిస్టు సంతోష్ నాయక్ మాట్లాడుతూ పటాన్ చెరు నుంచి కిష్టారెడ్డిపేట్ కి వెళ్లే రహదారి సమస్యలపై, జాతీయ రహదారి అక్రమాలపై తాను రాసిన కథనాలపై కక్షగట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనను చంపుతానని బెదిరించడం, అసభ్య పదజాలంతో దూషించడం జరిగిందన్నారు. దీనిపై పోలీసులకు పిర్యాదు చేసినట్టు తెలిపారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, ఏం జరిగినా మహిపాల్ రెడ్డిదే బాధ్యత అని వాపోయారు.

ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేస్తున్న జ‌ర్న‌లిస్టులు

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర్ రావు, ప్రెస్ క్లబ్ సలహాదారులు మారుతీ కుమార్, టెంజు శేరిలింగంపల్లి అధ్యక్షుడు పోచగౌని సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కిషోర్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు సురేష్, మోటూరి నారాయణ రావు, రాజు, కాంగెర్ సాల్వేడర్, కోశాధికారి లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శులు ఉప్పరి భిక్షపతి సాగర్, ఎల్లేశ్, అనిల్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, రాజేష్ గౌడ్, మహేందర్ గౌడ్, నగేష్ సాగర్, కృష్ణ సాగర్, శివ, టెంజు ఉపాధ్యక్షులు షకీల్, కృష్ణారెడ్డి, రామస్వామి, కోశాధికారి దయాసాగర్, సుగుణాకర్, రవీందర్, శశికాంత్, షఫీ, ప్రవీణ్, ఖదీర్, విజయ్,హేమంత్ రెడ్డి, రాంచందర్, మహేష్ కుమార్, సాయినాథ్ గౌడ్, మణికంఠ, ప్రభాకర్, రామకృష్ణ, ఆనంద్ గౌడ్, సత్యం, బి.కృష్ణ, శైలజ, అనిల్, అనిల్ చారి, జె.విజయ్, షర్ఫుద్దీన్, మూర్తి, కే.రాజు, కే.కృష్ణమాచారి, రామకృష్ణ సాగర్, గణేష్, కుమార్ యాదవ్, రాకేష్, రాజు, అజయ్, చంద్రశేఖర్, గంప సురేష్, మహేష్, శ్రీనివాస్ రాజు, అరుణ్, రాజేష్, వెంకటేష్, రమేష్, కిరణ్, కురుమయ్య, ప్రభాకర్, మహేందర్, కృష్ణ, శ్రీనివాస్, బి.రామకృష్ణ గౌడ్, రాజు, డేనియల్ రాజ్, వెంకటేష్ గౌడ్, శంకర్, శ్యాం కుమార్, కోటేష్, అంజి బాబు, రాజశేఖర్, రాము, దేవేందర్, రాజేందర్, యాదగిరి, రవి కుమార్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here