సాధారణంగా పని మనిషి ఉద్యోగానికి జీతం ఎంత ఉంటుంది. 10 నుండి 20 వేలు. బాగా ధనవంతుల ఇంట్లో ఐతే 50000 మించి ఉండదు. మరి లక్షల్లో జీతం అందించే పని మనిషి ఉద్యోగం ఎక్కడో తెలుసా…? బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్ కు చెందిన రాజప్రాసాదాలలో ఒకటైన విండ్సర్ క్యాజిల్ లో హౌస్ కీపింగ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కి దరఖాస్తు చేసుకోమని ప్రకటనను విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్లో ప్రచురించిన ప్రకటనలో ఈ ఉద్యోగానికి కి కావలసిన అర్హతలు వేతనం ఇతర సదుపాయాల వివరాలను విడుదల చేసింది.
హౌస్ కీపింగ్ అసిస్టెంట్ ప్రారంభ వేతనం 18.5 లక్షలు(19140 బ్రిటన్ పౌండ్లు) గా పేర్కొంది. వీరికి విలాసవంతమైన సదుపాయాలతో పాటు, ఏడాదికి 33 సెలవులు ఇతర సౌకర్యాలను అనుభవించే సదుపాయం ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు 13 నెలల శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు సదరు వ్యక్తి ఇంగ్లీషు మ్యాచ్ సబ్జెక్టులలో డిగ్రీ కలిగి ఉండాలి. హౌస్ కీపింగ్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక చేయబడ్డ వ్యక్తి రాజప్రసాదంలో హౌస్ కీపింగ్ తో పాటు ఇంటీరియర్ వస్తువుల పరిశుభ్రత భద్రత తదితర పనులను చేయవలసి ఉంటుందని వెబ్సైట్లో పేర్కొన్నారు.