న్యూఢిల్లీ (నమస్తే శేరిలింగంపల్లి): దేశవ్యాప్తంగా ఉన్న బంగారం కొనుగోలుదారులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శుభవార్త చెప్పింది. ఇకపై దేశంలో ఏ మలబార్ స్టోర్‌కు వెళ్లినా బంగారానికి అన్ని చోట్లా ఒకే రేటును అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ బుధవారం వన్ ఇండియా, వన్ గోల్డ్ రేట్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ తమ స్టోర్లలో వినియోగదారులకు స్వచ్ఛమైన, నాణ్యమైన బంగారాన్ని సరసమైన ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు దేశంలో తమ స్టోర్లలో ఎక్కడికి వెళ్లినా బంగారాన్ని ఒకే రేటుకు కొనవచ్చని, అలాగే తమకు చెందిన ఏ స్టోర్‌లో కొన్న బంగారానికి అయినా బై బ్యాక్ హామీ ఉంటుందని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ మలబార్ స్టోర్‌లలో 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ ధ్రువీకరణ ఉన్న ఆభరణాలనే విక్రయిస్తున్నామని, అందువల్ల వినియోగదారుల బంగారం నాణ్యంగా ఉంటుందని తెలిపారు.